గురించి
Charles Phillip Brown's English to Telugu Dictionary ని ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఆన్‌లైన్ నిఘంటువు. బ్రౌణ్ డిక్షనరి లోని ఆంగ్ల పదాలతో పాటు కొన్ని నూతన పదాలను కూడా ఇందులో చేర్చడం జరిగింది.
సూచనలు/సలహాలు
ఈ నిఘంటువును మరింత అభివృద్ధి చేయడానికి వాడుకదారుల సహాయం కూడా కోరుతున్నాము. పుస్తకం రూపంలో ఉన్న నిఘంటువును డిజిటల్ రూపంలోకి మార్చే క్రమంలో చాలా చోట్ల తప్పులు దొర్లాయి. కొన్ని పదాలకు అర్థాలూ మారిపోయాయి. అదీగాక, ప్రస్తుత నిఘంటువులో చాలా ఆంగ్ల పదాలను చేర్చవలసిన అవసరం కూడా ఉంది. ఏదైనా పదానికి, లేదా అర్థానికి మార్పును సూచించాలనుకుంటే, మీరు ఆ పదం వెతికినప్పుడు కుడివైపున కనబడే "మార్చండి" అన్నదానిపై నొక్కి మీ సూచనలు పంపండి. అలాగే ఏదైనా ఆంగ్ల పదానికి తెలుగు అర్థం ప్రస్తుతం ఉన్న నిఘంటువులో లేకపోతే, ఆ పదాన్ని కలపమని కూడా మీరు సూచించవచ్చు. మీ సూచనలు e-mail ద్వారా పంపాలనుకుంటే, dictionary@maalika.org కు పంపండి.
పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉన్న నిఘంటువును ఇక్కడి నుండి తీసుకోవడం జరిగింది. రాధిక తమ్మిశెట్టి గారు తయారు చేసిన ఈ మొదటి దశ నిఘంటువు అందుబాటులో లేకుండా ఉంటే, మేము ఈ పని చేయగలిగే వాళ్ళమే కాదు. అందులో ఉన్న ఆంగ్ల పదాలను, వాటి తెలుగు అర్థాలను సరి చూడడంతో పాటు, కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు అర్థాలు వెతకడం, తిరిగి రాయడం చేసింది, చేస్తున్నది... మృదుల, రంజీత్, భరధ్వాజ్, శ్రీను.